అనారోగ్యమైతే ప్రచారం ఎలా చేశారు..?
కోర్టులో సమర్పించిన ఈడీ నివేదికలో
న్యూఢిల్లీ – కేంద్ర దర్యాప్తు సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ గా ఉన్నారని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో మరో రాజకీయ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత కూడా ప్రముఖంగా ఉందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ కు సంబంధించి పొడిగించాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీంతో ఆయన వ్యవహారానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఈడీ గురువారం కోర్టుకు సమర్పించిన నివేదికలో. తనకు అనారోగ్యం ఉందనే సాకుతో బెయిల్ పొడిగించాలని కోరడం అబద్దమని పేర్కొంది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, ఇండియా కూటమి తరపున పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేశారని కుండ బద్దలు కొట్టింది.
అరవింద్ కేజ్రీవాల్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, కేసు నుంచి ఇంకొంత ఉపశమనం కలిగించేందుకు ఆడుతున్న నాటకంగా తీవ్ర ఆరోపణలు చేసింది ఈడీ. కాగా దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కోర్టు.