NEWSANDHRA PRADESH

మే 30 ఏపీలో చారిత్రాత్మ‌క రోజు

Share it with your family & friends

గుర్తు చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌రిగ్గా ఇదే రోజు మే 30న 2019లో తాను ఏపీ ముఖ్య‌మంత్రిగా తొలిసారి ప్ర‌మాణ స్వీకారం చేశాన‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు గురువారం సీఎం సామాజిక మాధ్య‌మం ట్విట్ట‌ర్ వేదిక‌గా అరుదైన ఫోటోను పంచుకున్నారు. ఇలాంటి అరుదైన స‌న్నివేశం మ‌ళ్లీ మ‌ళ్లీ రాద‌ని గుర్తు చేసుకున్నారు.

దేవుడి ద‌య‌, నాన్న దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆశీస్సులతో ప్ర‌జ‌లు త‌న‌ను ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నార‌ని, అఖండ మెజారిటీని క‌ట్ట‌బెట్టార‌ని తెలిపారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. స‌రిగ్గా ఐదేళ్ల కింద‌ట ఇదే రోజు వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు.

ఇన్నేళ్ల కాలంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేశామ‌ని వెల్ల‌డించారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తుంద‌ని మాట ఇస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.