బిలియనీర్లకు స్నేహితుడు మోడీ
మేం ప్రజా సేవకులకు మాత్రమే
పంజాబ్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏకి పారేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పంజాబ్ రాష్ట్రంలో పర్యటించారు. ఎస్బీఎస్ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
మోడీ 10 ఏళ్ల పాలనా కాలంలో 22 మందిని మాత్రమే బిలియనీర్లను మాత్రమే తయారు చేశాడని ఆరోపించారు. ఆయన పెట్టుబడిదారులకు, ఆర్థిక నేరస్తులకు స్నేహితుడంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. కానీ తాము వచ్చాక ఈ దేశంలోని ప్రజలందరికీ మెరుగైన పాలన అందజేస్తామని చెప్పారు.
ప్రతి ఒక్కరికీ విద్య, ఆరోగ్యంతో భరోసా తో కూడిన ఉపాధి హామీ పథకం అమలు చేస్తామన్నారు. మోడీ మాయల మరాఠీ అని మండిపడ్డారు. ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఉండే మనిషి కాదని ఆరోపించారు ప్రధానమంత్రి.
రోజూ వారీ వేతనం కూడా పెంచుతామన్నారు. ఆశా, మధ్నాహ్న భోజన , అంగన్ వాడి కార్యకర్తలకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.