కన్యాకుమారి సన్నిధిలో మోడీ
48 గంటల పాటు ధ్యానంలోనే
తమిళనాడు – ప్రసిద్ద పర్యాటక స్థలం, దేశం గర్వించ దగిన మహోన్నత మానవుడు వివేకానందుడు కొలువు తీరిన కన్యాకుమారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రచారం పూర్తయింది.
కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి 17వ లోక్ సభ ఎన్నికలను ఏకంగా ఏడు విడతలుగా నిర్వహించింది. దీని వల్ల భారత దేశ ఖజానాపై అదనపు భారం పడిందంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. అంతే కాకుండా కేవలం అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేలు చేకూర్చేలా తప్పుడు నిర్ణయం తీసుకుందంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఇది పక్కన పెడితే ప్రతిసారి ఎన్నికలు ముగిశాక ప్రసిద్ధ క్షేత్రాలను సందర్శించడం, అక్కడ ధ్యానం చేయడం ఆనవాయితీగా వస్తోంది ప్రధాని మోడీకి. ఈసారి కూడా ఎన్నికలు ముగియడంతో ఆయన వివేకానందుడి స్థలాన్ని ఎంచుకున్నారు. జూన్ 1 వరకు ధ్యానంలోనే ఉంటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.