జయలలిత హిందూత్వ నేత
అన్నామలై కుప్పుస్వామి కామెంట్స్
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , దివంగత జయలలిత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
జయలలిత అసలైన హిందూత్వ నాయకురాలని కొనియాడారు అన్నామలై కుప్పుస్వామి. ఇందుకు సంబంధించి ఆమె ఒకానొక సమయంలో కరసేవ గురించి మాట్లాడిన విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు . 1992లో కరసేవ అనేది తప్పు పదం కాదని అన్నారని తెలిపారు.
బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశంలోని 3 రాష్ట్రాలలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల తొలగింపును జయలలిత పూర్తిగా వ్యతిరేకించారని చెప్పారు అన్నామలై కుప్పు స్వామి. అంతేకాకుండా 1193లో రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా సంతకాల ప్రచారాన్ని కూడా నిర్వహించినట్లు తెలిపారు అన్నామలై కుప్పు స్వామి.
భారతదేశంలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మించలేమా, పాకిస్తాన్‌లో నిర్మించడం సాధ్యమేనా అని కూడా ఆమె ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్బంగా మరోసారి గుర్తు చేశారు. అంతే కాకుండా కఠినమైన మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకు వచ్చిందని, వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేసిందన్నారు.