NEWSTELANGANA

అర‌వింద్ కుమార్ కు బిగ్ షాక్

Share it with your family & friends


మెమో జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి

హైద‌రాబాద్ – గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకుని అధికార మ‌దంతో విర్ర‌వీగిన సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌కు ఇప్పుడు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ల‌ను అడ్డం పెట్టుకుని అందినంత మేర దోచుకున్న వారి బండారాలు ఒక్క‌టొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయి.

తాజాగా గ‌త పాల‌నలో చ‌క్రం తిప్పిన అర‌వింద్ కుమార్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఫార్ములాఈకి సంబంధించి , హెచ్ఎండీఏ మాజీ క‌మిష‌న‌ర్ అర‌వింద్ కుమార్ కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి మెమో జారీ చేశారు.

ప్ర‌భుత్వ ఆర్థిక శాఖ స‌మ్మ‌తి పొంద‌కుండానే రూ. 46 కోట్లు క‌లిపి పన్ను మొత్తం రూ. 9 కోట్లు హెచ్ఎండీఏ వ‌న‌రుల నుండి ఎలా ముంద‌స్తుగా చెల్లించార‌ని ప్ర‌శ్నించారు. ఇందుకు సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు సీఎస్.

సీజ‌న్ -10 ఈవెంట్ కు ప్ర‌మోట‌ర్ గా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ త‌ర‌పు ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు ఎందుకు శ్ర‌ద్ద చూపించ‌లేద‌ని నిల‌దీశారు. కాంపిటెంట్ అథారిటీ నుండి ఆమోదం పొందే ప్ర‌క్రియ‌ను అనుస‌రించ‌కుండా , స‌చివాల‌య బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ ఫార్ములా ఈ ఆప‌రేష‌న్స్ , ప్రైవేట్ ఆర్గ‌నైజ‌ర్ తో త్రైపాక్షిక లాంగ్ ఫార‌మ్ ఒప్పందాన్ని ఎందుకు న‌మోదు చేశారంటూ ప్ర‌శ్నించారు.