NEWSTELANGANA

రాజ ముద్ర‌లో కీల‌క మార్పులు

Share it with your family & friends

500 న‌మూనాలు అందాయ‌న్న సీఎం

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి స‌ర్కార్ రోజుకో కొత్త నిర్ణ‌యం తీసుకుంటోంది. ప్ర‌ధానంగా ప్ర‌ముఖ క‌వి రాసిన అందెశ్రీ జ‌య జ‌య‌హే రాష్ట్ర గీతానికి సంబంధించి రాద్దాంతం చోటు చేసుకుంది. దీనికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి స్వ‌ర క‌ల్ప‌న చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. దీనికి ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ఎంత చెల్లించార‌నేది తెలియాల్సి ఉంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా గీతానికి సంబంధించి రెండింటికి ఆమోద ముద్ర ల‌భించింద‌న్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాకారుల నుండి లోగోల కోసం దాదాపు 500 నమూనాలు అందాయని చెప్పారు. ఈ నమూనాలకు సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా తుది రూపకల్పన నిర్ణయించలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అదేవిధంగా వివిధ నమూనాల్లో కళాకారులు పని చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోలేదని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ తల్లి కొత్త చిహ్నం, విగ్రహంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా చూస్తామని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకంగా తెలంగాణ ప్రతిష్టను పెంచుతామని హామీ ఇచ్చారు.