కేసీఆర్ కు సర్కార్ ఆహ్వానం
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు పిలుపు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ మేరకు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. దీనిని పురస్కరించుకుని ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులతో పాటు అమరుల కుటుంబాలు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, బుద్ది జీవులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు సీఎం.
ఈ మేరకు తెలంగాణ ఉద్యమ రథ సారథి, మాజీ సీఎం కేసీఆర్ కు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానం పంపించారు. ఈ మేరకు ఆహ్వాన లేఖను అందజేశారు అధికారులు. ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ , డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సూచించారు రేవంత్ రెడ్డి.
జూన్ 2వ తేదీన ఉదయం 10 గంగలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ మాజీ సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి .
కేసీఆర్ ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బంది తో చర్చలు జరిపారు. గజ్వేల్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారని తెలిపిన సిబ్బంది. అక్కడకు వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక, లేఖ ను అందించారు.