మోడీ ధ్యానం సంచలనం
మోస్ట్ పాపులర్ లీడర్
తమిళనాడు – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి సంచలనంగా మారారు. తను 48 గంటల పాటు ధ్యానంలోకి వెళ్లి పోయారు. ఇందుకు సంబంధించి ప్రధాని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు.
మోడీ ధ్యానం చేస్తున్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. గతంలో 2019 ఎన్నికల సందర్బంగా ప్రచారం పూర్తయిన వెంటనే మోడీ హిమాలయ పర్వతాల లోకి వెళ్లి పోయారు. అక్కడ కొంత సేపు ధ్యానం చేశారు. ప్రస్తుతం దేశంలో 17వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 545 స్థానాలకు గాను 543 స్థానాలకు పోలింగ్ జరిగింది. వచ్చే జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఈసారి మోడీ తన స్థలాన్ని మార్చారు. హిమాలయాలు కాకుండా ప్రసిద్ద ప్రాంతంగా పేరు పొందిన దేశ గౌరవాన్ని తన ప్రసంగంతో కోట్లాది మందిని విస్తు పోయేలా చేసిన స్వామి వివేకానందుడు నడయాడిన కన్యాకుమారిలో ప్రస్తుతం ధ్యానం ప్రారంభించారు. ఈ కార్యక్రమం 48 గంటల పాటు కొనసాగుతుంది. ఈ విషయాన్ని మోడీనే స్వయంగా ప్రకటించారు.