ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
సిట్ అదుపులో ఎంపీ
కర్ణాటక – అత్యాచారం , లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ సిట్టింగ్ హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) బెంగళూరు ఎయిర్ పోర్టులో ప్రజ్వల్ రేవణ్ణను అదుపులోకి తీసుకుంది.
ప్రస్తుతం ఆయనపై బెంగళూరు పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. జేడీఎస్ కు భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతోంది. దీనిపై బీజేపీ నేతలు పల్లెత్తు మాట మాట్లాడక పోవడం విస్తు పోయేలా చేసింది.
అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నారు ప్రజ్వల్ రేవణ్ణ. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో బెంగళూరులో లేకుండా పోయాడు. ఇతర దేశాలకు పారి పోవడంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. చివరకు తన గ్రాండ్ ఫాదర్ , మాజీ ప్రధాన మంత్రి హెచ్ డి దేవె గౌడ సీరియస్ అయ్యారు.
దీంతో గత్యంతరం లేక ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరుకు రావడంతో పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. ఆయనను అరెస్ట్ చేశారు. కస్టడీకి తరలించారు.