మోడీ దేవుడైతే ధ్యానం ఎందుకు..?
నిప్పులు చెరిగిన భూపేష్ బాఘేల్
రాయ్‌పూర్ : ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలతో పాటు కంగనా రనౌత్ , సంబిత్ పాత్ర లాంటి పనిలేని నేతలు మోడీని దేవుడిని చేశారని ఎద్దేవా చేశారు.
సమస్త ప్రపంచాన్ని శాసించే శక్తులు కలిగిన దేవుడిగా భావించే మోడీ ఎందుకు ధ్యానం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఇదంతా మోడీ తన వ్యక్తిగత ప్రచారం పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నం తప్పా ప్రజల కోసం కాదన్నారు.
ఓ వైపు దేశం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఉన్నట్టుండి కొత్త డ్రామాకు మోడీ తెర లేపాడని మండిపడ్డారు మాజీ సీఎం. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ప్రధాన మంత్రి మోడీ తమిళనాడులోని కన్యాకుమారిని సందర్శించారు. అక్కడ అమ్మ వారిని కొలిచారు. అనంతరం 48 గంటల పాటు ధ్యానంలో మునిగి పోయారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం కొనసాగుతోంది.
ఒక్క మోడీ కోసం జాతీయ, రాష్ట్ర స్థాయికి చెందిన మీడియా సంస్థలన్నీ అక్కడ కొలువు తీరాయి.