NEWSNATIONAL

తేజ‌స్వి యాద‌వ్ సంచ‌ల‌నం

Share it with your family & friends

బీహార్ లో యువ‌త‌కు ఆద‌ర్శం

బీహార్ – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు బీహార్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి తేజ‌స్వి యాద‌వ్. త‌ను గ‌త కొంత కాలం నుంచి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. తాను చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటానని నిరూపించాడు కూడా. డిప్యూటీ సీఎంగా ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేశాడ‌న్న పేరు తెచ్చుకున్నాడు. ఇదే ఆయ‌న‌కు మ‌రింత చ‌రిష్మా వ‌చ్చేలా చేసింది.

ప్ర‌స్తుతం సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. దేశ వ్యాప్తంగా తొలిసారిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం 7 విడ‌త‌లుగా నిర్వ‌హించ‌డం విశేషం. దీని కార‌ణంగా భార‌త ఖ‌జానాపై భారీ బారం ప‌డింద‌ని మేధావులు పేర్కొన్నారు. ఇది ప‌క్క‌న పెడితే బీహార్ లో ఈసారి భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ త‌ప్ప‌ద‌ని అంచ‌నా.

బీహార్ లో ఇండియా కూట‌మికి 22 సీట్ల‌కు పైగానే వ‌స్తాయ‌ని అంచ‌నా. ప్ర‌ధానంగా తేజ‌స్వి యాద‌వ్ కు వెన్ను నొప్పి బాధ పెడుతున్నా లెక్క చేయ‌కుండా త‌ను పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టారు. ప్ర‌తి యువ‌కుడికి భ‌రోసా ఇచ్చారు. జాబ్ త‌ప్ప‌కుండా క‌ల్పిస్తామ‌ని మ‌రోసారి పంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో యువ‌త‌తో పాటు మ‌హిళ‌లు సైతం తేజ‌స్వి యాద‌వ్ ను కోరుకుంటుండ‌డం విశేషం.