తుపాను ప్రభావిత ప్రాంతాలకు భరోసా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కామెంట్
కన్యాకుమారి – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర సర్కార్ పూర్తి భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రస్తుతం కన్యాకుమారిలో మౌన ముద్రలోకి జారుకున్నారు.
దేశ వ్యాప్తంగా 17వ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇందులో భాగంగా తను ధ్యానం ప్రారంభించారు. జూన్ 1న శనివారం సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఈ ధ్యానం 48 గంటల పాటు నిర్వహించడం విశేషం. గత ఎన్నికల సందర్బంగా మోడీ హిమాయాలలో పర్యటించారు. అక్కడ ధ్యానం చేపట్టారు.
ఇదిలా ఉండగా తాజాగా దేశంలోని పలు ప్రాంతాలలో తుపాను ప్రారంభమైంది. అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ ప్రకృతి వైపరీత్యాలను చూశాయి. నా ఆలోచనలు , ప్రార్థనలు అక్కడ ప్రభావితమైన వారందరికీ ఉన్నాయని పేర్కొన్నారు మోడీ
. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. బాధితులను ఆదుకునేందుకు అధికారులు రంగంలోకి దిగుతున్నారు.