ప్రజా గొంతుకు ప్రతిరూపం
మోడీ పై అలుపెరుగని యుద్దం
న్యూఢిల్లీ – గత 10 ఏళ్లుగా ఒకే ఒక్కరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకంటే పరిచయం అక్కర్లేదు. ఈపాటికే తెలిసి పోయి ఉంటుంది. అతను ఎవరో కాదు భారత దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర దామోదర దాస్ మోడీ.
గుజరాత్ సీఎం గా కొలువు తీరిన కాలంలో మోడీ చేసిన నిర్వాకం గురించి దేశమంతటా తెలుసు. బిల్కిస్ బానో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిని నిర్దోషులుగా బయటకు వదిలి వేయడం దగ్గరి నుంచి నియంతృత్వపు పోకడలకు పెట్టింది పేరు ఈ సర్కార్.
ఇవాళ మోడీ ఏం చేసినా సంచలనమే. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినా లేదా వ్యాఖ్యానించినా కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. ఈ తరుణంలో దేశంలోని ప్రధాన మీడియా సంస్థలన్నీ గంప గుత్తగా ఇవాళ మోడీ భజన చేస్తున్నాయి.
కానీ కొందరు నిబద్దత కలిగిన యూట్యూబర్లు, జర్నలిస్టులు తమ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ప్రజల గొంతు వినిపించే ప్రయత్నంచేస్తున్నారు. అందులో వీరు కూడా ఒకరు కావడం విశేషం.