తిరుమల సన్నిధిలో అమిత్ షా
శ్రీనివాసుడిని దర్శించుకున్న మంత్రి
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్య క్షేత్రాన్ని శుక్రవారం కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం దర్శన భాగ్యం కల్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి దగ్గరుండి స్వామి వారి దర్శనానికి ఏర్పాట్లు చేయించారు. ఇదిలా ఉండగా కేంద్ర హొం శాఖ మంత్రి రాకతో తిరుమల ప్రాంగణం , చుట్టు పక్కల అంతా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
దేశ వ్యాప్తంగా 17వ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. జూన్ 1వ తేదీ శనివారం నాటితో 7వ విడత ఆఖరి పోలింగ్ తో ముగుస్తుంది. జూన్ 4న 543 లోక్ సభ స్థానాలకు సంబంధించి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీలో మోస్ట్ పాపులర్ గా పేరు పొందిన ప్రధాన మంత్రి మోడీ కన్యాకుమారిలో ధ్యానం ప్రారంభించగా నెంబర్ 2 గా ప్రసిద్ది చెందిన అమిత్ షా తిరుమలను సందర్శించారు. షాతో పాటు ఆయన సతీమణి కూడా శ్రీనివాసుడిని దర్శించు కోవడం విశేషం.