నేను నిజమైన దేశ భక్తుడిని
దుష్ప్రచారంపై డీకే కామెంట్
కర్ణాటక – తనపై జరుగుతున్న ట్రోలింగ్ ను , దుష్ప్రాచారాన్ని తీవ్రంగా ఖండించారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. శనివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. తాను కూడా భక్తుడినేనని, కానీ దానినే ప్రాతిపదికగా చేసుకుని ప్రచారం చేసుకోనంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తనకు తెలుసన్నారు.
భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశభక్తి కలిగి ఉందని అనుకోవడం భ్రమ తప్ప మరోటి కాదన్నారు. ఈ దేశంలో ఆలయాలను, ప్రార్థనా స్థలాలను, పర్యాటక ప్రాంతాలను పరిరక్షించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు డీకే శివకుమార్.
ఇక రాజ రాజేశ్వరి దేవి అమ్మ వారికి తాను భక్తుడినని, ఆమె పట్ల తనకు విశ్వాసం ఉందన్నారు. ఆలయంలో శత్రు సంహార పూజ నిర్వహించరని తనకు తెలుసన్నారు. తన స్వంత ఫామ్ హౌస్ లో పూజ చేశానని, ఇక్కడి నుంచే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు డీకే శివకుమార్.