‘హస్తం’ పరాజయం ఖాయం
కేంద్ర హోం శాఖ మంత్రి షా
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తప్పదని అన్నారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నిర్వహించే చర్చలలో పాల్గొన కూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనిపై సీరియస్ గా స్పందించారు అమిత్ షా. వారికి తెలుసు తాము కచ్చితంగా ఓడి పోతున్నామని, అందుకే డిబేట్ లో పాల్దొనేందుకు జంకుతున్నారని ఎద్దేవా చేశారు షా.
కాంగ్రెస్ నాయకులు ఈసారి పారి పోయేందుకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. ఎందుకంటే ఇన్నాళ్లుగా దేశాన్ని సర్వ నాశనం చేసింది చాలక తమపై బురద చల్లేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేశాయని మండిపడ్డారు కేంద్ర హోం శాఖ మంత్రి.
543 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీకి కనీసం 400 సీట్లకు పైగానే వస్తాయని స్పష్టం చేశారు. 143 కోట్ల మంది భారతీయులు సుస్థిరమైన ప్రభుత్వాన్ని, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, భారీ ఎత్తున తమకు అనుకూలంగా ఓట్లు వేశారని చెప్పారు అమిత్ చంద్ర షా.