ప్రధాని రేసులో రాహుల్ గాంధీ..?
ఆయన వైపే మొగ్గు చూపిన ఖర్గే
న్యూఢిల్లీ – దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎడతెగని రీతిలో ఉత్కంఠ నెలకొంది. శనివారం నాటితో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో జూన్ 4న మంగళవారం కీలకంగా మారనుంది. ఆరోజు 543 సీట్లకు సంబంధించి ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.
దీంతో ఈసారి ప్రతిపక్షాలు కలిసికట్టుగా మోడీ ని, ఆయన పరివారాన్ని, బీజేపీని, దాని అనుబంధ సంస్థలను ఎదుర్కోవడంలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఈసారి చాలా సీట్లను తన మిత్ర పక్షాల కోసం వదులుకుంది కాంగ్రెస్ పార్టీ.
100 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ పార్టీ ఇప్పుడు మెల మెల్లగా దూసుకు వస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏఐసీసీ మాజీ నేత, రాయ్ బరేలి ఎంపీ అభ్యర్థి రాహుల్ గాంధీ. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఊహించని రీతిలో స్పందన లభించింది.
ఫలితాలు తారుమారు కానున్నాయని, భారత కూటమికి కనీసం 300 సీట్లు వస్తాయని అంతర్గత సర్వే లో వెల్లడైంది. దీంతో ప్రధాని రేసులో రాహుల్ గాంధీ ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. ఆయనకు పూర్తి మద్దతు ఖర్గు తెలపడం విశేషం. ఇవాళ ఖర్గే సారథ్యంలో కీలక మీటింగ్ జరగనుంది.