NEWSNATIONAL

ఇండియా కూట‌మికి ఓటమి త‌ప్ప‌దు

Share it with your family & friends

ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ పీకే

బీహార్ – ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ , ఐ ప్యాక్ ఫౌండ‌ర్ ప్ర‌శాంత్ కిషోర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి బీజేపీ స్వామి భ‌క్తిని చాటుకునే ప్ర‌య‌త్నం చేశారు. 2019లో కంటే అత్య‌ధిక సీట్లు మోడీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ‌స్తాయ‌ని అంచ‌నా వేశారు. ఈ మేర‌కు ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ప్ర‌శాంత్ కిషోర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. ప్ర‌తిపక్షాల‌తో కూడిన ఇండియా కూట‌మిపై నోరు పారేసుకున్నారు. వారికి అంత సీన్ లేద‌న్నారు. మ‌రోసారి భంగ‌పాటు త‌ప్ప‌ద‌న్నారు. విచిత్రం ఏమిటంటే వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగారు ప్ర‌శాంత్ కిషోర్. వారు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌రంటూ మండిప‌డ్డారు.

మోడీకి ప్ర‌తిప‌క్షాల‌కు పోలికే లేద‌న్నారు పీకే. 2024లో జ‌రుగుతున్న 17వ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌రోసారి జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ముచ్చ‌ట‌గా మూడోసారి మోడీ పీఎంగా కొలువు తీర బోతున్నార‌ని అన్నారు.

సాంప్రదాయకంగా బలహీనంగా ఉన్న తూర్పు, దక్షిణాదిలలో బిజెపి గణనీయమైన లాభాలను పొందుతోందని చెప్పారు.