NEWSNATIONAL

చెరసాల‌లో వేధించే ఛాన్స్ – సీఎం

Share it with your family & friends

అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ – ఆప్ చీఫ్ , ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించి ఆయ‌న తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. రూ. 100 కోట్ల‌కు పైగా ముడుపులు ముట్టాయ‌ని, ఇందులో తెలంగాణ మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క పాత్ర పోషించార‌ని ఈడీ ఆరోపించింది. ఇప్ప‌టికే ఈ కేసులో ప‌లువురిని అరెస్ట్ చేసింది.

క‌విత కూడా త‌న‌ను కావాల‌ని అరెస్ట్ చేసిందంటూ వాపోయింది. మ‌ద్యం కుంభ‌కోణానికి సంబంధించి ప‌లువురిని అరెస్ట్ చేసింది ఈడీ. ఇదిలా ఉండ‌గా సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తాను ప్ర‌చారం చేయాల్సి ఉందంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు అర‌వింద్ కేజ్రీవాల్. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ఆయ‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది.

జూన్ 2న లొంగి పోవాల్సిందిగా స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పింది. అయితే త‌న ఆరోగ్యం బాగా లేద‌ని , బెయిల్ గ‌డువు పెంచాల‌ని కోరుతూ మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై కోర్టు అభ్యంత‌రం తెలిపింది. ఈ సంద‌ర్బంగా అర‌వింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు . తాను జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని, అక్క‌డ త‌న‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేసే ఛాన్స్ ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మోడీ , అమిత్ షా ప‌న్నిన కుట్ర‌లో భాగంగానే తాను జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని ఆరోపించారు ఢిల్లీ సీఎం.