NEWSNATIONAL

స్వాతి మ‌లివాల్ షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends

బీభ‌వ్ కుమార్ ను ర‌క్షించే ప్ర‌య‌త్నం

న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యస‌భ స‌భ్యురాలు, ఢిల్లీ విమెన్స్ క‌మిష‌న్ చైర్మ‌న్ స్వాతి మ‌లివాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను వేధింపుల‌కు గురి చేసిన బీభ‌వ్ కుమార్ పై మ‌రోసారి నిప్పులు చెరిగారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

సీఎం నివాసంలో కేజ్రీవాల్ ఉండ‌గానే బీభ‌వ్ కుమార్ దారుణంగా దాడికి పాల్ప‌డ్డాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం గురించి ప‌దే ప‌దే తాను ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. ఒక సీఎంగా బాధ్య‌త క‌లిగిన కేజ్రీవాల్ క‌ళ్ల ముందు జ‌రగ‌డం దారుణ‌మ‌న్నారు.

బీభ‌వ్ కుమార్ ఇలా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని, త‌న‌పై దాడి చేస్తాడ‌ని ఊహించ లేద‌న్నారు స్వాతి మ‌లివాల్. తాను అబ‌ద్దాలు చెపుతున్నానంటూ ఆప్ చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. ఈ సంద‌ర్బంగా తన‌కు న్యాయం కావాల‌ని కోరుతూ పోలీస్ స్టేష‌న్ ను ఆశ్ర‌యించాన‌ని పేర్కొన్నారు.

విచిత్రం ఏమిటంటే ఎయిమ్స్ లో త‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే గాయాలైన‌ట్లు ప‌రీక్ష‌లో తేలింద‌ని స్ప‌ష్టం చేశారు స్వాతి మ‌లివాల్.