బీజేపీకి 400 సీట్లు బక్వాస్
తేజస్వి యాదవ్ కామెంట్
బీహార్ – మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఏడవ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇవాల్టితో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. నిన్ననే ప్రచారానికి తెర పడింది. కొన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలలో పోలింగ్ జరుగుతోంది.
ఈ సందర్బంగా ఎన్నికల పోలింగ్ సరళిపై స్పందించారు తేజస్వి యాదవ్. ఆయన ఓ వైపు అనారోగ్యానికి గురైనా లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ఇండియా కూటమిలో ముఖ్య భూమిక వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే పదే తమకు ఈ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా వస్తాయని చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. తొలి విడత పోలింగ్ లోనే బీజేపీకి అంత సీన్ లేదని తేలి పోయిందని స్పష్టం చేశారు తేజస్వి యాదవ్.
ఈసారి మోడీ పనై పోయిందన్నారు. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ధ్యానం చేసినంత మాత్రాన పవర్ లోకి రావడం కుదరదని తెలుసుకుంటే మంచిదన్నారు.