దేశ ప్రజలకు ధన్యవాదాలు
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలలో చివరి విడత పోలింగ్్ శనివారంతో ముగిసింది. ఈ సందర్బంగా ఓ వైపు ఎండ వేడిమి ఉన్నప్పటికీ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు \బారులు తీరారు.
ఇవాళ పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 50కి పైగా స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా సార్వత్రిక ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు గాను పెద్ద ఎత్తున స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
పేదలకు పెత్తందారులు,పెట్టుబడిదారులకు మధ్య జరిగిన ఈ ఎన్నికల పోరులో చివరకు ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమికే విజయం దక్కుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.
అహంకారానికి, నిరంకుశత్వానికి ప్రతీకగా మారిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. జూన్ 4న విజేతలు ఎవరో అనేది తేలుతుందన్నారు .