ఫలితాల తర్వత పీఎంపై నిర్ణయం
భారత కూటమిదే విజయం
న్యూఢిల్లీ – ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి కీలక సమావేశం ముగిసింది న్యూఢిల్లీ. సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలకమైన నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , ఎంపీ రాఘవ్ చద్దా, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, సీతారం ఏచూరి, సుప్రియా సూలే, తదితరులు హాజరయ్యారు.
సమావేశం అనంతరం బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. తమ కూటమి విజయం సాధించ బోతోందని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ఆశలు నీరు కారడం ఖాయమన్నారు. వారు ఏం చేశారని 400 సీట్లు వస్తాయో చెప్పాలని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఇండియా కూటమిని ప్రజలు ఆదరించారని, ప్రధానంగా నార్త్ లో గంప గుత్తగా తమకు ఓటు వేశారని చెప్పారు తేజస్వి యాదవ్. ఇవాళ కీలక సమావేశం జరిగిందని, ప్రధాన మంత్రి ఎవరనేది త్వరలోనే తేలుతుందన్నారు .