ఇండియా కూటమికి 295 సీట్లు
ప్రజా సర్వేలో వెల్లడైందన్న ఖర్గే
న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. శనివారం నాటితో పోలింగ్ ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో తొలిసారిగా 7 విడతలుగా పోలింగ్ చేపట్టింది. దీని వల్ల అధికంగా ఖజానాపై భారం పడింది.
ఇది పక్కన పెడితే ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమితో పాటు భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ మధ్య హోరా హోరీగా పోరు నడిచింది. తాము చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలతో పాటు మోడీ సమర్థవంతమైన నాయకత్వం మరోసారి పవర్ లోకి వచ్చేలా చేస్తోందని ఆశిస్తోంది.
అయితే తాజాగా ఖర్గే నివాసంలో ఇండియా కూటమి అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇది ప్రభుత్వం చేపట్టిన సర్వే కాదన్నారు. ప్రజలు చేపట్టిన సర్వేలో వాస్తవం తేలిందన్నారు. ఇక మోడీ ధ్యానం చేసుకుంటూ ఉంటేనే బెటర్ అని సూచించారు. మొత్తంగా జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు 143 కోట్ల మంది భారతీయులు.