భారతీయులకు ధన్యవాదాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ – దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దేశ వ్యాప్తంగా ఎన్నికల పండుగకు తెర పడింది. ఇక మిగిలింది ఎవరు విజేత అనేది తేలనుంది. జూన్ 4న మంగళవారం 143 కోట్ల భారతీయులంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 545 లోక్ సభ స్థానాలకు గాను 543 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. తొలిసారిగా 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఏడు విడతలుగా పోలింగ్ చేపట్టింది.
దీనిని వ్యతిరేకించాయి ప్రతిపక్షాలు. ఇక చివరి దశ పోలింగ్ కు తెర పడడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఓటు వేసిన ప్రతి ఒక్క భారతీయుడికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.
ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అన్నది అత్యంత కీలకమని, దానిని వినియోగించుకున్నందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో భారీ ఎత్తున పోలింగ్ లో పాల్గొన్న యువతీ యువకులకు, మహిళలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు మోడీ.