అమరులారా అభివందనం
నివాళులు అర్పించిన కేటీఆర్
హైదరాబాద్ – ఉద్యమ సారథి కేసీఆర్ లేక పోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్. జూన్ 2న తెలంగాణ ఏర్పడిన రోజు. ఈ రోజుకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎందరో బలిదానాల, ఆత్మ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. భారత దేశ చరిత్రలో తనకంటూ ఓ పేజీని స్వంతం చేసుకున్నది.
ఇవాళ్టితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తయింది. దీంతో కొలువు తీరిన కొత్త రాష్ట్రం కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి కేటీఆర్. నాలుగున్నర కోట్ల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, బలిదానాలు, ఆందోళనలు, నిరసనల మధ్య తెలంగాణ ఏర్పాటు అయ్యిందని అన్నారు. కేవలం అమరుల త్యాగాల మీద ఏర్పడిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము చేసిన ప్రయత్నం ఫలించడం తనకు సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. పోరాటంలో అసువులు బాసిన ప్రతి ఒక్క అమరుడికి పేరు పేరునా నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు.