ప్రజా సర్వేలో ఇండియాకే పట్టం
295 సీట్లు వస్తాయన్న మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేల సందడి నెలకొంది. అన్నీ గంప గుత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ కూటమి మరోసారి అధికారంలోకి రానుందని పేర్కొన్నాయి. ఇది పక్కన పెడితే తాము పవర్ లోకి వస్తామని ప్రకటించింది ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి.
ఆయా రాష్ట్రాల వారీగా ఎన్ని సీట్లు వస్తాయనేది సంఖ్యలతో సహా వెల్లడించారు ఇండియా కూటమి తరపున ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఇండియా కూటమికి రాష్ట్రాల వారీగా చూస్తే ఇలా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 40 సీట్లు ఇండియా కూటమికి వస్తాయని ప్రకటించారు ఖర్గే. ఇక కర్ణాటకలో 15 నుంచి 16 సీట్లు, రాజస్థాన్ లో 7 సీట్లు , మహారాష్ట్రలో 24 సీట్లు, బీహార్ లో 22 సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
తమిళనాడు, పుదుచ్చేరి కలుపుకుని 40 సీట్లు, కేరళలో 20 సీట్లు, బెంగాల్ లో 24 సీట్లు, చండీగఢ్ లో 1, పంజాబ్ లో 13 సీట్లు వస్తాయని తెలిపారు.
న్యూఢిల్లీలో ఇండియా కూటమికి 4 సీట్లు రానున్నాయని, ఛత్తీస్ గఢ్ లో 5 సీట్లు, జార్ఖండ్ లో 10 సీట్లు, మధ్య ప్రదేశ్ లో 7 సీట్లు, హర్యానాలో 7 సీట్లు వస్తాయని అంచనా వేశారు.