అందరి కళ్లు అన్నామలై పైనే
కోయంబత్తూరు ఫలితంపై ఉత్కంఠ
తమిళనాడు – దేశంలో సార్వత్రిక ఎన్నికల తతంగం ముగిసింది. ఈసారి ఎన్నికలు అత్యంత పోటా పోటీగా కొనసాగాయి. నువ్వా నేనా అన్న రీతిలో జరిగినా చివరకు భారతీయ జనతా పార్టీనే గెలుస్తుందని , మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొలువు తీరడం ఖాయమని అన్ని సర్వేలు , మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి.
ఇది పక్కన పెడితే మోస్ట్ పాపులర్ లీడర్ గా పేరు పొందారు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పు స్వామి. ఆయన రాష్ట్రంలో బీజేపీకి ఐకాన్ గా ఉన్నారు. పార్టీ చీఫ్ గా కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు.
తమిళనాడులో కేవలం డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్థానిక పార్టీలు కొన్ని ఉన్నాయి. కానీ రెండు బలమైన పార్టీల మధ్య బీజేపీని కూడా విస్మరించ లేని పార్టీగా తీర్చి దిద్దడంలో ముఖ్య భూమిక పోషించారు అన్నామలై కుప్పు స్వామి.
ఈసారి తమిళనాడుపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు దేశ ప్రధాని మోడీ. ఆయన చాలా సార్లు పర్యటించారు. ప్రచారానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా దేశ చరిత్రలో తమిళనాడుకు విశిష్టమైన స్థానం ఉందని కూడా కొనియాడారు ప్రధానమంత్రి.