NEWSTELANGANA

సీఎంకు దెబ్బ బీఆర్ఎస్ కేక

Share it with your family & friends

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో విక్ట‌రీ

పాల‌మూరు జిల్లా – ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో కోలుకోలేని షాక్ త‌గిలింది సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన న‌వీన్ కుమార్ రెడ్డి ఊహించ‌ని రీతిలో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు. గ‌తంలో ఇదే పార్టీలో ఉంటూ , టీటీడీ మాజీ బోర్డు స‌భ్యుడిగా ఉన్న మ‌న్నె జీవ‌న్ రెడ్డి ఉన్న‌ట్టుండి ఎన్నిక‌ల‌కు ముందు జంప్ అయ్యారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో ఎలాగైనా సరే గెలుపొందాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. సీఎం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ను దీంతో ముంద‌స్తుగా ఎలా దెబ్బ కొట్టాల‌నే దానిపై బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సార‌థి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ ప్లాన్ ఫ‌లించింది.

స్థానిక సంస్థ‌ల శాస‌న మండ‌లి స‌భ్యుడిగా న‌వీన్ కుమార్ రెడ్డి అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేశారు. కోట్ల రూపాయ‌లు పంపిణీ చేసినా చివ‌ర‌కు బీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలుపొంద‌డం విశేషం. న‌వీన్ కుమార్ రెడ్డి ఏకంగా 108 ఓట్ల తేడాతో త‌న స‌మీప కాంగ్రెస్ అభ్య‌ర్థ‌ఙ మ‌న్నె జీవ‌న్ రెడ్డిపై విజ‌యం సాధించారు.

ఇదిలా ఉండ‌గా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గ‌తంలో ఎమ్మెల్సీగా ఉన్న క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న క‌ల్వ‌కుర్తి నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. మొత్తం 1437 ఓట్లు పోల్ అయ్యాయి.