తమిళ నాట కాషాయ జెండా
బీజేపీ చీఫ్ కె. అన్నామలై
తమిళనాడు – దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ కలకలం రేపుతున్నాయి. గంప గుత్తగా అన్నీ మోడీ వైపు మొగ్గు చూపుతుండడంతో ఒక్కసారిగా జనం విస్తు పోతున్నారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలో ప్రజలు స్వచ్చంధంగా తమ ప్రభుత్వాన్ని కోరుకున్నారనే విషయం అర్థమై పోయిందన్నారు అన్నామలై. ప్రపంచంలోనే సమర్థవంతుడైన నాయకుడిగా మోడీ గుర్తింపు పొందారని, ఆయన ముచ్చటగా మూడోసారి పీఎం కావడం తేలి పోయిందన్నారు .
ఎగ్జిట్ పోల్స్ తమిళనాడులో బీజేపీ హవా కొనసాగుతుందని తేల్చి చెప్పాయని స్పష్టం చేశారు కె. అన్నామలై. తమకు గుర్తింపే లేదంటూ పదే పదే ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్న ఎంకే స్టాలిన్ కు చుక్కలు చూపిస్తామన్నారు కె. అన్నామలై. తమకు గణనీయంగా 20 శాతానికి పైగానే ఓటు బ్యాంకు రానుందని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను కోయంబత్తూరు నుండి గెలుపొందడం ఖాయమన్నారు.