NEWSTELANGANA

హ‌రీశ్ రావు షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends

పాకిస్తాన్ వేడుక‌ల‌తో పోలుస్తారా

హైద‌రాబాద్ – మాజీ మంత్రి హ‌రీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరిపితే పాకిస్థాన్ వేడుకలతో పోల్చడం కుసంస్కారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమ‌ని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి, తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉన్న వారికి రాష్ట్ర అవతరణ ప్రాముఖ్యత అర్థం అవుతుందన్నారు.

ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారికి, నోటి నుండి ఒక్కసారి కూడా జై తెలంగాణ అని నినదించని వారికి, అమరులకు ఏనాడు నివాళులర్పించని వారికి ఆ ఆర్తి, ఆ భావోద్వేగం ఎలా అర్థమవుతుందని ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు.

ఒక్క రోజు ముందుగా జరపడం కాదు, ఏడాది పొడుగునా పండుగగా దశాబ్ది ఉత్సవాలను నిర్వ‌హించ‌డం త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.

2023 జూన్ 2వ తేదీ నుండి 21 రోజులపాటు జరిపిన ఉత్సవాలలో ఆట పాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామ‌ని పేర్కొన్నారు.