రాష్ట్ర గీతాన్ని ఖూనీ చేసిన కీరవాణి
ఏం స్వర కల్పన..ఏం గీతం ఇది
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రముఖ కవి, రచయిత, గాయకుడు అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆంధ్రాకు చెందిన కీరవాణి స్వర కల్పన చేశారు.
జూన్ 2న రాష్ట్ర అవతవరణ దినోత్సవం సందర్బంగా పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దీనిని విన్న ప్రతి ఒక్కరు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని పేర్కొన్నారు దాసోజు శ్రవణ్ కుమార్. కోట్లాది మందిని ప్రభావితం చేసిన జయ జయహే తెలంగాణ గీతానికి అర్థం పర్థం లేకుండా స్వర కల్పన చేకూర్చారంటూ కీరవాణిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
తెలంగాణ అస్తిత్వం, ఆర్తి గీతంగా ఉంటూ వచ్చిన ఈ గీతానికి ఉన్న విలువ లేకుండ ఆచేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ చరిత్రను కించ పర్చడం తప్ప మరోటి కాదన్నారు దాసోజు శ్రవణ్ కుమార్.