NEWSNATIONAL

నిన్న ధ్యానం నేడు స‌మావేశం

Share it with your family & friends

కార్య రంగంలోకి ప్ర‌ధాన‌మంత్రి

న్యూఢిల్లీ – దేశంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసింది. జూన్ 4న పోలింగ్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. ఇవాళ జాతీయ మీడియా సంస్థ‌లు, స‌ర్వే కంపెనీల‌న్నీ గంప గుత్త‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌ని జోష్యం చెప్పాయి.

దీంతో ఫుల్ జోష్ లో ఉన్నాయి కాషాయ పార్టీ శ్రేణులు. దేశ వ్యాప్తంగా ముంద‌స్తుగానే సంబురాలు కొన‌సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా గ‌త 48 గంట‌ల నుంచి క‌న్యాకుమారిలో ధ్యానం చేప‌ట్టారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ.

అనంత‌రం హుటా హుటిన ఆయ‌న ఢిల్లీకి చేరుకున్నారు. త‌న 100 రోజుల యాక్ష‌న్ ప్లాన్ ను అమ‌లు చేసేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం చేప‌ట్టారు.

ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేడిగాలులు, తుఫాను అనంతర వరద పరిస్థితుల నేపథ్యంపై స‌మీక్షించారు న‌రేంద్ర మోడీ. బాధితుల‌కు భ‌రోసా ఇవ్వాల‌ని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు.