వైసీపీ శ్రేణులు జర జాగ్రత్త
సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్
అమరావతి – వైసీపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను మేనేజ్ చేసిన ఘనుడు బాబు అంటూ ఎద్దేవా చేశారు. తను పోలింగ్ సందర్బంగా అధికారులను కూడా మభ్య పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వైసీపీ నేతలు, శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏజెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు.
ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలింగ్ కౌంటింగ్ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. వెంటనే తమ దృష్టికి కూడా తీసుకు రావాలని సూచించారు సజ్జల. ఆరు నూరైనా సరే వైసీపీ పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.