సెక్రటేరియట్లో వాస్తు మార్పులు
శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ సర్కార్
హైదరాబాద్ – తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించడం , బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన రాష్ట్ర రాజ ముద్రలో మార్పులు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి.
తాజాగా రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు మార్పు చేయడం విస్తు పోయేలా చేసింది.. ఈ మేరకు శర వేగంగా తొమ్మిదో అంతస్తులో పనులు కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్.. ఇక నుండి వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా బయటకు వెళ్లి పోనుంది.
సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారుల రాక పోకలు.. సెక్రటేరియట్ లోపల మరికొన్ని మార్పులు చేర్పులు చేయిస్తోంది సర్కార్. గతంలో దివంగత ఎన్టీఆర్ , ఇటీవలే పదవి నుండి దిగి పోయిన కేసీఆర్ ఈ వాస్తు పనులు చేపట్టారు.