మోడీ భజన మానితే బెటర్
నిప్పులు చెరిగిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ – సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలో 17వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ పూర్తయింది. జూన్ 4న మంగళవారం తుది ఫలితాలు రానున్నాయి. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ ఛానల్స్ , సంస్థలు అన్నీ గంప గుత్తగా బీజేపీకి 390 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి.
దీనిపై తీవ్రంగా స్పందించారు సోనియా గాంధీ. అవి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తయారు చేసిన ఎగ్జిట్ పోల్స్ అంటూ ఎద్దేవా చేశారు. తాము వీటిని నమ్మడం లేదన్నారు . ప్రజా సర్వేలో 295 సీట్లు ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు సోనియా గాంధీ. మోడీ తన వ్యక్తిగత ప్రచారం కోసం పని చేశాడు తప్పా దేశం కోసం పని చేయ లేదన్నారు .