కరుణానిధి అరుదైన నేత
కొనియాడిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ – తమిళనాడు రాష్ట్ర అభివృద్ది కోసం ఎంతగానో కృషి చేశారంటూ మాజీ సీఎం, దివంగత కరుణానిధిని గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ సందర్బంగా ఆయన భౌతికంగా లేక పోయినా ఆయనతో తాను సంభాషించిన క్షణాలు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు.
ట్విట్టర్ వేదికగా సోమవారం ప్రధాన మంత్రి తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇవాళ కలైంజ్ఞర్ కరుణానిధి 100వ జయంతి. ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు నరేంద్ర మోడీ. ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించారని కొనియాడారు.
కరుణానిధి ఎందరికో స్పూర్తి దాయకంగా నిలిచారని తెలిపారు. తమిళనాడు ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడ్డాడనని ప్రశంసించారు మోడీ. తామిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో చాలా సార్లు మాట్లాడుకున్నామని గుర్తు చేశారు పీఎం.