కరుణానికి నేతల నివాళి
జాతి గర్వించ దగిన నేత
తమిళనాడు – రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి 100వ జయంతి సందర్బంగా దేశానికి చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలు ఘనంగా నివాళులు అర్పించారు. తమిళనాడులో డీఎంకే పార్టీ చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమానికి సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, తనయుడు రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి నేతలు హాజరయ్యారు. పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఫరూక్ అబ్దుల్లా, సీతారాం ఏచూరి, డి. రాజా, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఈ దేశంలో ప్రజా స్వామ్యం కోసం ఎంతగానో కృషి చేసిన అరుదైన నాయకుడు కలైంజ్ఞర్ అంటూ కొనియాడారు. ఆయన నాయకత్వం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఆనాడు అందరినీ ఏక తాటిపైకి తెచ్చిన ఘనత కరుణానిధికే దక్కుతుందన్నారు.