బెంగాల్ లో కాషాయ జెండా
బీజేపీ నేత సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్ – సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని స్పష్టం చేశారు బీజేపీ అగ్ర నేత సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీకి చుక్కలు చూపిస్తామన్నారు. ఇక సీఎం దీదీ పని అయి పోయిందన్నారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము సత్తా చాటుతామని, బెంగాల్ లో క్లీన్ స్వీప్ చేస్తామని ప్రకటించారు. ఇందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. పెట్టే బేడా సర్దుకునేందుకు రెడీగా ఉండాలంటూ ఎద్దేవా చేశారు సువేందు అధికారి.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని ఇప్పటికే ప్రకటించాయని, ఇక తమకు తిరుగే లేదన్నారు సువేందు అధికారి. దేశంలో మోడీ హవా కొనసాగుతోందన్నారు. తమకు 400 సీట్లకు పైగా వస్తాయని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
ఇదిలా ఉండగా పోలింగ్ కౌంటింగ్ సందర్బంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా బెంగాల్ లో 400 కేంద్ర బలగాలు మోహరించి ఉన్నాయి.