యావత్ భారతం మోడీ జపం
బీజేపీ నేత కొంపెల్లి మాధవీలత
హైదరాబాద్ – ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై స్పందించారు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి అంతా ఎగ్జిట్ పోల్స్ ను బహిష్కరించారని కానీ వారిని జనం నమ్మే స్థితిలో లేరన్నారు.
వాస్తవానికి వారు ఈ దేశంలో లేరని ఎద్దేవా చేశారు. వారికి ఎంత సేపు మోడీని, బీజేపీని, కేంద్ర సర్కార్ ను ఆడి పోసుకోవడంతోనే సరి పోతోందన్నారు. ఇండియా కూటమి నేతలు కళ్లున్న కబోధులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవీలత.
143 కోట్ల భారతీయులంతా ముక్త కంఠంతో ఉక్కు సంకల్పం కలిగిన సమర్థుడైన నరేంద్ర మోడీనే తిరిగి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమ పార్టీ మరోసారి పవర్ లోకి వస్తుందని అన్నారు. తమకు 400 కు పైగా సీట్లు వస్తాయని చెప్పారు.