ఏపీలో మళ్లీ జగనే సీఎం
పరిపూర్ణానంద స్వామి
అమరావతి – పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం హిందూపురంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో శాసన సభ, లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ముందస్తు అంచనా వేశారు. ఈ మేరకు ఏపీలో తిరిగి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
తనకు ప్రాథమికంగా సమాచారం అందిందని ఆ మేరకు తాను జోష్యం చెబుతున్నట్లు ప్రకటించారు పరిపూర్ణానంద స్వామి. వైసీపీకి 123 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ , రాష్ట్రంలో మరోసారి వైసీపీ కొలువు తీరడం ఖాయమన్నారు పరిపూర్ణానంద స్వామి.
ఇదిలా ఉండగా ఆయన ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురం శాసన సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. ఇక్కడ ప్రముఖ సినీ నటుడు, దివంగత ఎన్టీఆర్ తనయుడు, చంద్రబాబు నాయుడు బావ మరిది నందమూరి బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా తను పోటీ చేశారు.