NEWSNATIONAL

కేంద్ర మంత్రి రేసులో నితీశ్

Share it with your family & friends

ప్ర‌ధాని మోడీని క‌లిసిన సీఎం

ఢిల్లీ – భార‌త దేశ రాజ‌కీయాల‌లో అత్యంత అవ‌కాశ‌వాద రాజ‌కీయ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్. ఆయ‌న చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండ‌ర‌న్న అప‌వాదు ఉంది. ఇప్ప‌టికి ప‌లుమార్లు యూపీఏలో, ఎన్డీఏతో చేతులు క‌లిపారు. ఆయ‌న కుదురుగా ఒక చోట ఉండ‌ర‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా సోమ‌వారం ఉన్న‌ట్టుండి మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా ఆరారు నితీశ్ కుమార్. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని క‌లుసుకున్నారు. ఈ సంర‌ద్బంగా వీరిద్ద‌రూ సంభాష‌ణ‌ల్లో మునిగి పోయారు.

జూన్ 4న మంగ‌ళ‌వారం 17వ విడ‌త ఎన్నిక‌ల‌కు సంబంధించి ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. మొత్తం 543 సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. బీహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత నితీశ్ కుమార్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కేంద్ర కేబినెట్ లోకి వ‌స్తార‌ని టాక్. అందుకే పీఎంను క‌లిసిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.