ఈసీని కలిసిన బీజేపీ బృందం
హింస చెలరేగే ప్రమాదం ఉంది
న్యూఢిల్లీ – దేశంలో జూన్ 4న మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి వారే తామే గెలుస్తామని ప్రకటిస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి నేతృత్వంలో ఓ బృందం సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ మేరకు ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది.
కౌంటింగ్ సందర్బంగా కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సర్కార్ మోసానికి, దౌర్జన్యానికి పాల్పడే ఛాన్స్ ఉందని ఆరోపించింది. ఈ మేరకు సీసీటీవీ మోనిటరింగ్ చేయాలని, కౌంటింగ్ పూర్తయ్యాక పోటీ చేసిన అభ్యర్థులు, పోలైన ఓట్లు, వచ్చిన ఓట్ల వివరాలను వెల్లడించాలని, ఆ తర్వాతనే ఫలితాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అంతే కాకుండా ఫారం 17సీని కూడా తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించింది. ఇదిలా ఉండగా ముందుగా కాంగ్రెస్ బృందం కలిసిన తర్వాత ఉన్నట్టుండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో బీజేపీ బృందం ఈసీని కలిసింది. రేపు జరిగే కౌంటింగ్ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కూటమి అల్లర్లకు పాల్పడే ఛాన్స్ ఉందని ఫోకస్ పెట్టాలని కోరింది.