9న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష
ప్రకటించిన టీఎస్పీఎస్సీ
హైదరాబాద్ – తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సంచలన ప్రకటన చేసింది. జూన్ 9న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ సందర్బంగా అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది టీఎస్పీఎస్సీ.
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే ముందు తమ హాల్ టికెట్లను సరి చూసు కోవాలని సూచించింది. దానిని ఎగ్జామ్ రూమ్ కు వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉంచు కోవాలని పేర్కొంది టీఎస్పీఎస్సీ. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి హాల్ టికెట్లను జారీ చేయడం జరిగిందన్నారు.
తమ కమిషన్ కు సంబంధించిన టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. హాల్ టికెట్ తీసుకున్న వెంటనే పాస్ పోర్టు సైజ్ ఫోటోను తప్పనిసరిగా అతికించాలని పేర్కొంది.
ఇదిలా ఉండగా ఈ ఫోటో కేవలం 3 నెలల లోపు దిగినదే అయి ఉండాలని స్పష్టం చేసింది టీఎస్పీఎస్సీ. హాల్ టికెట్ లో ఫోటో అతికించక పోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తి లేదని హెచ్చరించింది. ఈ కీలక నిబంధనను హాల్ టికెట్ లో పొందు పర్చినట్లు తెలిపింది.