కౌంటింగ్ వద్ద జర జాగ్రత్త
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ – దేశం మార్పును కోరుకుంటోందని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. దేశ వ్యాప్తంగా 143 కోట్ల మంది భారతీయులలో అత్యధికంగా ఓట్లు వేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. మోడీ మీడియా తయారు చేసిన ఎగ్జిట్ పోల్స్ గురించి తాము పట్టించు కోవడం లేదని స్పష్టం చేశారు.
మంగళవారం దేశమంతటా 17వ విడత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్బంగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉండగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడే ఛాన్స్ ఉందని ఆరోపణలు చేశారు ఏఐసీసీ చీఫ్ . ఉన్నతాధికారులు తమ విధులను నిర్వర్తించాలని, ఎవరి పైనా భయం, పక్ష పాతం , దురుద్దేశం లేకుండా దేశానికి సేవ చేయాలని కోరుతోంది.
ఎవరికీ భయ పడాల్సిన అవసరం లేదన్నారు ఖర్గే. రాజ్యాంగ విరుద్దమైన వాటికి తల వంచాల్సిన పని లేదన్నారు.