పవర్ స్టార్ గేమ్ ఛేంజర్
ఏపీలో కూటమి ముందంజ
అమరావతి – ఏపీలో ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వస్తున్నాయి. చాలా చోట్ల కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులు తమ ఇళ్లకు వెళ్లి పోయారు. ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభంజనం కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్న నినాదానికి ప్రజలు చెక్ పెట్టారు.
కోట్లాది రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు చేరువ అయ్యేలా చేసినా చివరకు మీకు లబ్ది చేకూరితేనే తనకు ఓటు వేయమని కోరినా జగన్ మోహన్ రెడ్డిని విశ్వసించ లేదు. గంప గుత్తగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు ఓటు వేశారు.
ఇదిలా ఉండగా ఎప్పుడైతే చంద్రబాబును జైలుకు వెళ్లేలా చేశారో ఆనాటి నుంచి టీడీపీ, జనసేన గ్రాఫ్ పెరిగి పోయింది. ఇక ఎన్డీయేకు దూరంగా ఉంటూ వచ్చిన బాబును మోడీకి, షాకు దగ్గర చేసిన ఘనత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది.
ప్రస్తుతం పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నారు. మొత్తంగా ఆయనే గేమ్ ఛేంజర్ అని చెప్పక తప్పదు.