NEWSNATIONAL

మోడీ మ్యాజిక్ వ‌ర్క‌వుట్ కాలేదు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన అజ‌య్ రాయ్

ఉత్త‌ర ప్ర‌దేశ్ – వార‌ణాసి బ‌రిలో నిలిచిన యూపీ పీసీసీ చీఫ్ అజ‌య్ రాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికైనా దేశంలోని మీడియా సంస్థ‌లు , దాని అధిప‌తులు , స‌ర్వే సంస్థ‌లు త‌ల దించు కోవాల‌ని అన్నారు. మోడీకి ఇక‌నైనా భ‌జ‌న చేయ‌డం మానుకోవాల‌ని లేక పోతే జ‌నం త‌న్ని త‌రిమే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు అజ‌య్ రాయ్.

రామ మందిరం నిర్మాణం పేరుతో దేశంలో ఓట్లు కొల్ల గొట్టాల‌ని అనుకున్న నీచ రాజ‌కీయ వ్యూహాల‌ను ఓట్ల రూపంలో షాక్ ఇచ్చార‌ని అన్నారు. ఇవాళ స్టాక్ మార్కెట్ లో ఆశించిన మేర లాభాలు రాలేద‌ని చెప్ప‌డం కూడా ఇది మోడీ టీం ఆడుతున్న డ్రామాగా కొట్టి పారేశారు అజ‌య్ రాయ్.

ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌ల‌ని, ఇంకా ఎన్నిక‌ల ఫ‌లితాలు పూర్తిగా రాలేద‌ని, చివ‌రి వ‌ర‌కు వేచి చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ దేశాన్ని మ‌తం పేరుతో మ‌భ్య పెట్టాల‌ని చూసిన ప్ర‌ధాన‌మంత్రి సిగ్గుతో త‌ల వంచు కోవాల‌ని హెచ్చ‌రించారు. ఇక‌నైనా బీజేపీ చిల్ల‌ర రాజ‌కీయాలు మానుకుంటే బెట‌ర్ అని పేర్కొన్నారు అజ‌య్ రాయ్.