NEWSTELANGANA

వెంక‌టేశ్ వియ్యంకుడి విజ‌యం

Share it with your family & friends

ఖ‌మ్మంలో కాంగ్రెస్ విక్ట‌రీ

ఖ‌మ్మం జిల్లా – రాజ‌కీయాలు విచిత్రంగా ఉంటాయి. ఏపీ రెండు రాష్ట్రాలుగా విడి పోయినా కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఇంకా ఆంధ్రుల పెత్త‌నం కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు కూట‌మి ఏపీలో విజ‌యం సాధించ‌డంతో ఇక్క‌డ తెలంగాణ‌లో సంబురాలు మొద‌ల‌య్యాయి. ఆయ‌న శిష్యుడిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి సీఎంగా కొన‌సాగుతున్నారు.

ఇక ఆంధ్ర ప్రాంతానికి చెందిన న‌టుడు వెంక‌టేశ్ వియ్యంకుడిని ఖ‌మ్మంలో కాంగ్రెస్ పార్టీ లోక్ స‌భ స్థానానికి నిల‌బెట్ట‌డం విస్తు పోయేలా చేసింది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో రామ సాహాయం ర‌ఘురామ్ రెడ్డి గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేశారు.

ఆయ‌న త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, భార‌తీయ జ‌న‌తా పార్టీ నుండి బ‌రిలో ఉన్న ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త నామా నాగేశ్వ‌ర్ రావుపై ఏకంగా 3,70,921 కోట్ల తేడాతో గెలుపొంద‌డం విశేషం. ఈయ‌న గారి గెలుపు కోసం వెంక‌టేశ్ తో పాటు ఆయ‌న కూతురు కూడా ప్ర‌చారం చేసింది. మొత్తంగా తెలంగాణ‌ను ఆంధ్రాగా మార్చేస్తారేమోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది.