NEWSANDHRA PRADESH

బాబు నివాసంలో సంబురాలు

Share it with your family & friends

కేక్ క‌ట్ చేసిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – ఏపీలో అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు టీడీపీ చీఫ్ , సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న కూట‌మిని త‌యారు చేయ‌డంలో చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింది. మొత్తం అసెంబ్లీ స్థానాల‌కు 175 స్థానాల‌కు గాను అత్య‌ధిక స్థానాల‌లో టీడీపీ కూట‌మి రికార్డ్ బ్రేక్ చేసింది. నిన్న‌టి దాకా అహంకార పూరితంగా పాల‌న సాగించిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు ప్ర‌జ‌లు.

ఊహించ‌ని రీతిలో విక్ట‌రీని క‌ట్టబెట్ట‌డంతో సంతోషానికి లోన‌య్యారు చంద్ర‌బాబు నాయుడు. వైసీపీని తుక్కు తుక్కుగా ఓడించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. రాచ‌రిక పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ కూట‌మి గ్రాండ్ విక్ట‌రీని సాధించ‌డంతో చంద్ర‌బాబు నాయుడు ఇంట్లో సంబురాలు మిన్నంటాయి. ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి దేవి, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణితో పాటు కొడుకు నారా లోకేష్ సైతం పాల్గొన్నారు.